అంబేద్కర్ భవన్ నూతన కమిటీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి

TEJA NEWS

అంబేద్కర్ భవన్ నూతన కమిటీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.

గోపినగర్ అంబేద్కర్ భవన్ లో నూతన కమిటీను ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్ లో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ భవనంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం నూతన కమిటీ బాడీ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానికవాసుల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన అధ్యక్షులుగా రమేష్, అధ్యక్షులుగా మల్కయ్య, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, సలహాదారునిగా నర్సింహా మరియు రవీందర్ లను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… నూతన కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అని అన్నారు. గోపినగర్, బాపునగర్, నెహ్రూనగర్ కాలనీలలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ధ్యేయంగా అన్ని రకాలుగా కృషి చేసానని, ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్ లో కమిటి వారి డిమాండ్స్ మేరకు ప్రహరీ గోడ, బాత్రూమ్ మరియు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమ ఎంపికకు సహకరించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ముసలయ్య, రాజ్ కుమార్, విజయలక్ష్మి, ఆనంద్, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్, సాయినాథ్, వెంకటేష్, నర్సింహా, సైదులు యాదవ్, దస్తగిరి, ప్రభాకర్, యేసు, పెంటయ్య, మహేష్, అశోక్, తుకారామ్, కార్తీక్, కమిటీ సభ్యులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top