ఇరుకుంటతండా సర్పంచిగా పాత్లోత్ లక్ష్మణ్ నాయక్ 66 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

TEJA NEWS

ఇరుకుంటతండా సర్పంచిగా పాత్లోత్ లక్ష్మణ్ నాయక్ 66 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

శంకర్‌పల్లి:

శంకర్‌పల్లి మండల పరిధిలోని
ఇరుకుంటతండా సర్పంచిగా పాత్లోత్ లక్ష్మణ్ నాయక్ 66 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఇంత పెద్ద బాధ్యత ‘నాపై పెట్టినందుకు గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మా వార్డు సభ్యులందరికీ సేవకునిగా పనిచేస్తా’ అని, ఎవరికీ ఏ సమస్య వచ్చినా గ్రామస్తులతో కలిసి పని చేస్తానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని తెలియజేశారు. గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top