చందిప్ప గ్రామ సర్పంచిగా మాదోళ్ళ మల్లికార్జున్
అభినందించిన మాజీ మంత్రి కేటీఆర్
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని
చందిప్ప గ్రామ సర్పంచిగా
బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదోళ్ళ మల్లికార్జున్ 201 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పై ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా నగరంలోని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నూతన సర్పంచ్ మల్లికార్జున్, ఉప సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీ నర్సింలు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ మాట్లాడుతూ మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ లను కేటీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామంలో ఉన్న పెండింగ్ పనులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని సర్పంచ్ తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు
