2026 జనవరి నెల యన్ టి ఆర్ సామజిక పెన్షన్లు డిసెంబర్, 31న పంపిణీ

TEJA NEWS

2026 జనవరి నెల యన్ టి ఆర్ సామజిక పెన్షన్లు డిసెంబర్, 31న పంపిణీ

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న యన్ టి ఆర్ భరోసా ఫించన్లు డిశంబర్ 31 న పంపిణీ చేయడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జనవరి 1 వ తేదీ (నూతన సంవత్సరం కారణంగా) 2026 జనవరి 1 న పంపిణి చేయవలసిన పెన్షన్లు ను ఈ నెల 31 న బుధవారం ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30 న సచివాలయ సిబ్బంది బ్యాంకు ల నుండి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ నెల 31 నే వంద శాతం పెంచన్లు పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అనివార్య కారణం ల చేత 31న తీసుకోని వారికి 2 వ తేదీ న పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top