నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకోండి.

TEJA NEWS

నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకోండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జగతగిరిగుట్ట పరిధిలో ప్రశాంతంగా జరిగేలా ఏర్పాటు చెయ్యాలని నిఘా, భద్రత పెంచాలని కోరుతూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో సీఐ వెంకటేష్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వారు సీఐ కి బెల్ట్ షాప్ లు ఈ రెండు రోజులు ఎట్టి పరిస్థితులో నడవకుండా కఠినమైన ఆదేశాలు జారిచేయ్యాలని, అదే విధంగా స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్టాప్, స్మశాన వాటిక, ఈ సేవ సెంటర్, హెచ్ఎంటి స్మశాన వాటిక, రింగ్ బస్తి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలల దగ్గర, దేవాలయం మెట్ల దగ్గర, హెచ్ఎంటి ఖాళీ స్థలంలో, రాజీవ్ గృహకల్ప కాని స్థలాల్లో, బెల్ట్ షాపులు, గుట్ట చౌరస్తా తదితర ప్రాంతంలో నిత్యం గస్తీ ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు. గత సంవత్సరం కూడా ప్రశాంతంగా జరిగిందని ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే పత్రిక ప్రకటనను విడుదల చేయాలని కోరడం జరిగింది.


సీఐ గారు స్పందిస్తూ శాంతి భద్రత ల రక్షణ కోసం తమ వంతుగా పనిచేస్తామని చెప్పి,ఆయా బస్తిల మరియు బెల్ట్ షాప్ ల వివరాలను రాసుకొని ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు,రాములు , కోశాధికారి సదానంద్, జర్నలిస్టు రామస్వామి, సిపిఐ నాయకులు సాయిలు, కే వెంకటేష్, శ్రీనివాస్ చారి, రాధాకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, కుమారస్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top