కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్ పరిధి హెచ్ ఏ ఎల్ కాలనీ లోని శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో గిరి ప్రదక్షిణ కు దారి, దేవాలయ గుట్ట మీదకి మెట్ల దారి, మరియు కళ్యాణ మండపానికి ఛానల్ గేట్లను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
అనంతరం శ్రీశైలం గౌడ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ దేవాలయం అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, లక్ష్మీ నరసింహ స్వామి కృప ఎల్లప్పుడూ ప్రజలందరి పైన ఉండాలని, లక్ష్మీ నరసింహ స్వామి దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేకేఎమ్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ , ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేన గుప్తా , ఉపాధ్యక్షులు ఎన్ శ్రీరాములు , ఆర్ యాదగిరి ప్రధాన కార్యదర్శి , ఈ సురేష్ కోశాధికారి, నరసింహారెడ్డి కార్యదర్శి, మరియు శంకర్ రెడ్డి , ఇంద్రసేనారెడ్డి , రవీందర్ గౌడ్ , టీవీ శ్రీను , భాస్కర్ రెడ్డి , మోహన్ రెడ్డి , సిహెచ్ బుచ్చి రెడ్డి , అంజి యాదవ్ , గోవర్ధన్ రెడ్డి , ఐ యాం సాగర్ , మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు , కూన రాఘవేంద్ర గౌడ్ , చౌడ శ్రీనివాస్ , నాగిళ్ల శ్రీనివాస్ , ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి , గౌడ్ శెట్టి శివ ఈశ్వరరావు , షాకీర్, వెంకట్, నర్సింగరావు, మురళి, ప్రభాకర్ రెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
