ఎన్నికల్లో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకం అమలు

TEJA NEWS

ఎన్నికల్లో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకం అమలు చేసి తెలంగాణ ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచిన రేవంతన్న సర్కార్

దేశంలోనే కని విని ఎరగని రీతిలో గృహ ఉపయోగకర విద్యుత్ వినియోగంకు అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లును అమలు చేసి తెలంగాణ ఆడబిడ్డలకు “గృహజ్యోతి పథకం తో” వారి కుటుంబాలలో “వెలుగులు” నింపిన ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ పథకం అమల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 295 డివిజన్ బౌరంపేట్ లో గృహజ్యోతి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రీటింగ్స్ అందజేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో గృహజ్యోతి పథకం కింద 1,25,000 కుటుంబాలు లబ్ధిపొందారని తెలియజేశారు.

గృహ జ్యోతి పథకం ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తుందని. పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించే ఈ బృహత్తర పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి లబ్ధిదారులకు మరియు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు.

గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు
₹ 3,593 కోట్లు చెల్లించిందని.

రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా భరోసా కల్పిస్తూ, వ్యవసాయదారులకి నూతన విద్యుత్ కనెక్షన్లు 2024 లో 97,893 కనెక్షన్లు, 2025 లో 1,00,267 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ SPDCL, NPDCL కింద ప్రతి నెల 52 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మిద్దిల యాదిరెడ్డి, నర్సారెడ్డి తేజ రెడ్డి(NTR), విద్యుత్ అధికారులు DE శ్రీనివాస్ గౌడ్, ADE ప్రేమ్ కుమార్, AE సాయి కిరణ్, లైన్మెన్ శివకుమార్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి బాల్ రెడ్డి, ఆర్కెల విజయ్ గౌడ్, జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షుడు పోచి మహేష్, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతకింది సురేష్, ఆంజనేయ వర్మ, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బి.చిరంజీవి, జిత్తయ్య మరికొందరు నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top