ఐజ మున్సిపల్
చైర్మన్ గా సీఎం సురేష్.
అలంపూర్ :
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ చైర్మన్గా సీఎం సురేష్ ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, పట్టణ ప్రజలు అవకాశాన్ని ఇవ్వడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, పట్టణ ప్రజలందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
వైస్ చైర్మన్ గా మాల నరసింహులు ఎన్నికయ్యారు.
పార్టీ తరపున పోటీచేసి గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు.
మిగతా వార్డు కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం ద్వారా బాధ్యతలను చేపట్టారు.
అయిజ మున్సిపాలిటీ అభివృద్ధికి కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటల నమ్మవద్దని, అభివృద్ధిపై ఎటువంటి అనుమానం అవసరం లేదని, అన్ని రకాల ఆమోదయోగ్యమైన పాలనా వ్యవస్థను రూపొందించి, పట్టణ అవసరాలకు ప్రత్యేక విజన్ రూపొందించడం జరిగిందని, సీఎం సురేష్ మరియు వైస్ చైర్మన్ మాల నరసింహులు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు అభిమానులు సీఎం సురేష్ వైస్ చైర్మన్ నర్సింలును పూలమాలలతో అభినందించారు.
