ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఉమ్మడి జిల్లా సమావేశం

TEJA NEWS

‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్…

పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో పాల్గొన్న రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్ రాజ్ ఠాగూర్..

కరీంనగర కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల పై జిల్లా ఇంచార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సన్నహాక సమావేశం నిర్వహించారు.

మంత్రి శ్రీపొన్నం ప్రభాకర్ తో పలు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్.మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమలు కానున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.

ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్య సేవలు, ప్రజల భద్రత, సంక్షేమ కార్యక్రమాలు, పిల్లల రక్షణ, డ్రగ్స్‌కు నో ప్రచారం, విద్యాభివృద్ధి, యువత, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించి సమీక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top