ప్రముఖ సినీ, సీరియల్ నటుడు బి. క్రిష్ణా నాయక్‌కు సంతాప సభ

TEJA NEWS

ప్రముఖ సినీ, సీరియల్ నటుడు బి. క్రిష్ణా నాయక్‌కు సంతాప సభ

తిరుపతి:

రైల్వే శాఖలో రిటైర్డ్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్‌గా సౌత్ సెంట్రల్ రైల్వేలో సేవలందించి, ప్రముఖ సినీ, సీరియల్ నటుడిగా గుర్తింపు పొందిన బి. క్రిష్ణా నాయక్ మృతికి సంతాపంగా తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని సుదర్శన్ ఆటోస్టాండ్ వద్ద గురువారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వక్తలు మాట్లాడుతూ, క్రిష్ణా నాయక్ తన సేవా భావం, కళాప్రతిభతో సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. సుదర్శన్ ఆటోస్టాండ్ గౌరవ సలహాదారులు, ఎన్‌టీఆర్ నటనాలయం వ్యవస్థాపకులుగా ఆయన కళారంగానికి చేసిన సేవలను స్మరించారు.

02-01-1958న జన్మించిన క్రిష్ణా నాయక్ 03-03-2026న పరమపదించారు. ఆయన జీవితంలో చోటుచేసుకున్న సేవా కార్యక్రమాలు, కళారంగంలో చేసిన కృషిని సభలో గుర్తుచేశారు. దశదినకర్మ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, తిరుపతి రైల్వే స్టేషన్ ముందర భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుదర్శన్ ఆటోస్టాండ్ గౌరవ అధ్యక్షులు కోడూరు బాలసుబ్రమణ్యం సతీమణి కోడూరు నీలిమ, ఉపాధ్యక్షులు అండ్ లీగల్ అడ్వైజర్ ఐ.చంద్రశేఖర్ రెడ్డి, క్రిష్ణా నాయక్ కుమారుడు జైదేవ్ రాథోడ్, డాక్టర్ రవిదేవ్, ఆటో యూనియన్ నాయకులు ఐ ఎస్ ఖాజా, ద్వారకనాథ్ గుప్త బాబు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top