దూలపల్లి లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ *….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి లో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా *మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ * హాజరయ్యి ఆ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు…..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు…
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని మరియు చిత్తారమ్మ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు..
అనంతరం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించి ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు…
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతల సాయి యాదవ్, రమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, అందే మహేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, జిమ్మీ దేవేందర్, డప్పు నరేందర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
