మారుమూల గ్రామాల ప్రజలకు మొబైల్ వ్యాన్ల ద్వారా ఉచిత న్యాయ సేవలు………. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత
వనపర్తి
రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు గ్రామగ్రామానికి న్యాయసేవలను విస్తరించాలనే ఉదేశ్యంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్ లను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శ్యామ్ కోసి లు ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చేర్మెన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్. సునీత , వనపర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి వి. రజని లు తెలిపారు. నూతనంగా ప్రారంభించబడిన మొబైల్ వ్యాన్లు ఇకనుండి లోకదాలత్ పైన గ్రామాగ్రామానికి వెళ్లి ప్రజలకు చట్టాలపైన అవగాహన మరియు న్యాయసేవాధికారాసంస్థలు ఎలాపనిచేస్తాయో, న్యాయ సేవా అధికార సంస్థ ప్యానెల్ న్యాయ వాదులు పారా లీగల్ వాలంటీర్స్ ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి ఉచిత న్యాయసేవలు, ఎలా అందజేయడం జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ మొబైల్ వ్యాన్ లొ వీడియోస్ చూడడానికి ఎల్ఈడి ( Led) టీవీ, అక్కడినుండే వీడియో కన్ఫరెన్స్ వంటి సదుపాయాలు ఉంటాయని ఈ మొబైల్ న్యాయసేవ వ్యాన్ ద్వారా ప్రజలకు న్యాయసేవలు మరింత దగ్గర్వుతుందని ప్రజలకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజలకు న్యాయసేవ మరింత దగ్గర్వుతుందని జిల్లా న్యాయసేవ చేర్మెన్ మరియు సెక్రటరీ లు తెలిపారు. ఈ మొబైల్ న్యాయ సేవా వ్యాన్ గ్రామ గ్రామానికి వెళ్లి న్యాయ సేవల గురించి వివరిస్తుంది కావున ప్రతి ఒక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
