
తెలంగాణ బడ్జెట్ ఆమోద ప్రాయమని, రాష్ట్ర అభివృద్ధి కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది : యువ నేత రామకృష్ణ గౌడ్
2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.5.2,34,406గా ఉంది. మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి, వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు.
వివిధ రంగాలకు కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని అంశాలపై ప్రసంగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల (17,82,198 కోట్లు) రూపాయలు ఉందనీ… గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదు అయ్యిందని మంత్రి తెలిపారు. అలాగే.. దేశ GDP 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల (3,57,13,886 కోట్లు) రూపాయలు కాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉందని వివరించారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందనీ. అదే విధంగా దేశ GDPలో రాష్ట్ర GSDP 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’ గా తెలంగాణ నిలుస్తోందని మంత్రి తెలిపారు మూసీ నది పునరుద్ధరణ: “మూసీ నది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాము. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 TMC ల నీరు మూసీకి అందించబడుతుంది. 45 STP లు ఇప్పటికే పని చేస్తుండగా, అదనంగా మరో 39 STPలు మంజూరు చేయగా, అవి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. మూసీనది బఫర్ జోన్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాము. మా ప్రభుత్వం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి త్వరలోనే చేపడుతాం. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము” అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ సమావేశంలో తెలిపారుహైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ సౌకర్యాన్ని పాతబస్తీ కి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్-11 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును L&T సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ (Phase-2, Phase-3) అత్యవసరంగా మారింది” అని మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.వరంగల్ విమానాశ్రయం కోసం భూ సేకరణను పూర్తిచేసి, నిర్మాణపు పనులను వేగవంతం చేస్తాం. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఆదిలాబాద్ ఈ బడ్జెట్లో రవాణా, రోడ్డు, భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము” అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ, దీనిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు (NGO), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుంది. అయినా, ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీరు, మురుగునీటి సేవలను, హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుంది. గోదావరి తాగునీటి ప్రాజెక్ట్. కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేశాం. వాటి నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతోంది. పాత GHMC సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం “H-CITI’ పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించాం” అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
“వరంగల్ విమానాశ్రయం కోసం భూ సేకరణను పూర్తిచేసి, నిర్మాణపు పనులను వేగవంతం చేస్తాం. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఆదిలాబాద్ ఈ బడ్జెట్లో రవాణా, రోడ్డు, భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము” అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైలు: మంత్రి భట్టి విక్రమార్క
రోడ్ల అభివృద్ధి: “రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్ బి రోడ్లను HAM (Hybrid Annuity Mode) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.” అని మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు
తలసరి ఆదాయం: రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4 లక్షల 18 వేల 931 రూపాయలు (రూ.4,18,931) కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. దేశ తలసరి ఆదాయం 2 లక్షల 19 వేల 575 రూపాయలు (రూ.2,19,575) కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1 లక్ష 99 వేల 356 రూపాయలు (రూ.1,99,356) ఎక్కువ. అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 200 బిలియన్ US డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాలవారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం” అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
“2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల (17,82,198 కోట్లు) రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో, దేశ GDP 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల (3,57,13,886 కోట్లు) రూపాయలు కాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. అదే విధంగా దేశ GDPలో రాష్ట్ర GSDP 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’ గా తెలంగాణ నిలుస్తోంది. భారతదేశ వృద్ధిరేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ, మన రాష్ట్ర వృద్ధిరేటులో మెరుగైన పెరుగుదల కనబడుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతంగా ఉన్న దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు, 2025-26 నాటికి 8 శాతానికి పడిపోయింది. కానీ, సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్ధిరేటు 2024-25 లో 10.6 శాతం నుంచి 2025-26 నాటికి 10.7 శాతానికి పెరిగింది. దీని ద్వారా, మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరియైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనడానికి నిదర్శనం” అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
“2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.5.2,34,406గా ఉంది. మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి, వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను” అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
“తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030ను ప్రకటించి అమలు చేస్తున్నది. ఈ పర్యాటక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం మరియు స్థానిక కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ విధానానికి ప్రైవేటు రంగం నుండి విశేష స్పందన లభించింది. తద్వారా 25,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్లో మిస్వరల్డ్ పోటీలు నిర్వహించడంతో ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించింది.
ఈ బడ్జెట్లో పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము” అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జె్ట్ ప్రసంగంలో తెలిపారు
“పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ‘కుంభమేళా’ తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డి. శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్-కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.” అని మంత్రి భట్టి విక్రమార్క బడ్జె్ట్ ప్రసంగంలో తెలిపారు.
“HYDRAA సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడింది. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60 వేల కోట్లుగా ఉంటుంది. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయి. చెరువుల సంరక్షణకు సీసీటీవీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాము” అని మంత్రి భట్టి విక్రమార్క.. బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
రవాణా శాఖ: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ, త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు, 105 కోట్ల 16 లక్షల రూపాయల పన్ను మినహాయింపులు మంజూరు చేశాం. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాము. దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాము. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు “సారథి”, “వాహన్” లను తెలంగాణలో అమలు చేస్తున్నాము. “వాహన్” సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తాము” అని మంత్రి భట్టి …