రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శారద నగర్ ఈద్గా

TEJA NEWS

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శారద నగర్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్…

పెద్దపల్లి రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శారద నగర్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులతో కలసి ప్రత్యేక నమాజ్‌లో పాల్గొని, వారి ఆనందాన్ని పంచుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ, ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top