కుత్బుల్లాపూర్ లోని అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకాలు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ లోని అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించిన నాయకులు, మన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన దాదాపు 16 మంది లబ్ధిదారులకు సుమారు 6.00 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా రెండవ రోజు జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ డివిజన్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్ష, నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు.

126 – జగద్గిరిగుట్ట డివిజన్…
జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన 13 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4,39,500/- ల విలువ గల చెక్కులను మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానము మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు నాగరాజులు లబ్ధిదారులకు అందజేశారు.

127 – రంగారెడ్డి నగర్ డివిజన్….
రంగారెడ్డి నగర్ డివిజన్ కు చెందిన 3 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,25,500/- ల విలువ గల చెక్కులను బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్, కార్తీక్ గౌడ్, బాలు నేత, ఎర్వ సాయి కిరణ్, శ్రీను లు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్ లోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే నాయకులు, మన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని, గత పన్నండేళ్ళ కాలంలో కోట్లాది రూపాయల నిధులతో ప్రజలకు ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలు అందించిన నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top