అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై గళమెత్తిన కుత్బుల్లాపూర్ “ప్రజా గొంతుక ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్” కి ధన్యవాదాలు…

TEJA NEWS

అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై గళమెత్తిన కుత్బుల్లాపూర్ “ప్రజా గొంతుక ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్” కి ధన్యవాదాలు….

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2026-27 సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాలలో ” డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలోని” సమస్యలపై “కుత్బుల్లాపూర్ ప్రజల గొంతుకై” ప్రభుత్వాన్ని ప్రశ్నించి చర్చ జరిగేలా చేసినందుకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కి” ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ…. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే తన ధ్యేయమని అన్నారు. రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, 2బిహేచ్కే సొసైటీ సభ్యులు దేవ కుమార్, ముస్తఫా, జహంగీర్ భాయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top