విశాఖ లోప్రయావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక సంస్కరణ

TEJA NEWS

విశాఖ లోప్రయావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక సంస్కరణ

ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు పర్యావరణ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాశ్రమిక ప్రాంతాల్లో వ్యర్థాలను సక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారా లేదా అని పరిశీలించడం కోసం 3 రోజుల పర్యటన కోసం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తొలి రోజున పరవాడ ప్రాంతంలో ఉన్న విశాఖ ఫార్మా సిటీ,మరియు అచ్యుత పురంలో ఉన్న జలవ్యర్థాల శుద్ధి కర్మాగారం మరియు బ్రాండిక్స్ ఇండియా కంపెనీ లను సందర్శించి అన్ని విషయాలు పరిశీలించడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ..ముఖ్యంగా విశాఖ ఫార్మా సిటీలో ఉన్న 93 కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలను ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు సక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారా లేదా అని పరిశీలించి కొన్ని జాగ్రత్తలు మరియు లోపాలను కూడా చెప్పి వెంటనే సరిదిద్దుకోవాలని యాజమాన్యానికి తెలియ చేశారు.(ఏపీ ఈ ఎం సి ఎల్) ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా యాప్ క్రియేట్ చేసి పరిశ్రమల ద్వారా వస్తున్న వ్యర్థాల మానిఫెస్ట్ ఎంత వస్తుంది అనేది ఈ యాప్ లో ఎప్పటికప్పుడు తెలియచేసి ఆన్ లైన్ లో తెలియచేసే విధానం సక్రమంగా ఉందా లేదా పరిశీలించి అలానే వ్యర్థాలను నిర్వీర్యం చేయడం కోసం పోతున్న వాహనాలను ట్రాకింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి సూచనలు చేసేమన్నారు.సముద్రంలో కలిపే వ్యర్థాలను ఎలా ట్రీట్మెంట్ చేసి హాని లేకుండా వ్యర్థాలను సముద్రంలో కలిపే లా చేస్తున్నారా అని పరిశీలించారు

You cannot copy content of this page

Scroll to Top