
కోదాడ అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం….*
ఫైర్ స్టేషన్కు నూతన వాహనం అందిస్తాం… ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…
విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.కోదాడ ఫైర్ స్టేషన్కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్ వాహనాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిబ్బంది, బాలాజీ నగర్ ప్రజల కోసం కార్యాలయ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు.
అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,జిల్లా ఫైర్ ఆఫీసర్ వై కృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ బాబు, స్థానిక కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, చైతన్య నాయక్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.