
నీటి సంరక్షణ పోస్టర్ ప్రదర్శన
…
తిరుపతి / శ్రీకాళహస్తి: తొట్టంబేడు
మండలంలోని దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్ లో
విద్యాశాఖ నిర్వహిస్తున్న జల పక్వాడ కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో నీటి సంరక్షణ పోస్టర్ ని తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పాఠశాల
స్థాయిలోనే విద్యార్థులకు నీటి పొదుపు, చెట్లు నాటడంపై అవగాహన కల్గించాలని కోరారు. వర్షపునీరు భూగర్భ జలాలుగా
మారడంలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించాలని , వృధా నీటిని అరికట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తాము తయారు చేసిన జల సంరక్షణ పోస్టర్ తో గ్రామంలో నీటిని సంరక్షించండి, చెట్లను కాపాడండి అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.