
పడుగుపాడు పై ప్రత్యేక దృష్టి పెడతాం..
ప్రతి సమస్య పరిష్కరిస్తాం..
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి..
నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలోని పడుగుపాడుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి అన్నారు. శనివారం కోవూరు పరిధిలోని పడుగుపాడు 11, 12, 13, వార్డులలో కూటమి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడుగుపాడు ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనదని ఇక్కడ ప్రజలతో మాట్లాడగా కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారన్నారు వాటిని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి నాయకులతో మాట్లాడడం జరిగిందన్నారు. పడుగుపాడు పై ప్రత్యేక దృష్టి పెట్టి రానున్న రోజుల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, దారపనేని శ్రీనివాస నాయుడు, బత్తల రమేష్, విన్నం కోట రాఖి, షేక్. ఫిరోజ్, షేక్.నాసిర్, పటాన్ నజీర్, యస్.డి దత్తగిరి, షేక్. షఫీ, సూరిశెట్టి శ్రీనివాసులు, వావిళ్ళ భాస్కర్,పాలూరు బాలకృష్ణ, మన్నేపల్లి పవన్ కుమార్ జనసేన, షేక్. మహమ్మద్,కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.