బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం

TEJA NEWS

బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్…

సాక్షిత : సిఎంసి నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలో లబ్ధిదారులకు అందుతున్న సదుపాయాలపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మాణం, వాటర్ లీకేజీ, లిఫ్ట్ ల నిర్వాహణ, నీటి సంపు, ప్రార్థన మందిరాలపై స్థలాల కేటాయింపు, పార్కుల అభివృద్ధి, అంగన్ వాడీ, బస్తీ దవాఖాన, స్మశాన వాటిక కై స్థలం కేటాయింపు, వీధి దీపాల ఏర్పాటు వంటి సదుపాయాలను కల్పించాలని ఎమ్మెల్యే గారికి విన్నవించారు.

అనంతరం వారు మాట్లాడుతూ….. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలోని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పరుస్తున్నామని, రానున్న రోజుల్లో ఇండ్లలో మౌలిక వసతులతో పాటు ప్రార్ధన మందిరాలు, వైకుంఠధామాలకు స్థలాలు కేటాయించి అభివృద్ధి పరుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు, రెవెన్యూ, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగాలతో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఆగం రాజు, చందు, గాజుల సుజాత, రంగరాయ ప్రసాద్, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయ కమిటీ సభ్యులు ఫర్జానా సలీం, షేక్ అహ్మద్, కె. రాజు, బిపిన్, లాజర్, జయరాజు, నరసింహ, రవి, రమేష్, కృష్ణ, వెంకట్రావు, శివ ప్రసాద్, రఫీక్, పాల్గొనా చారి, షాహిన్ శర్మ, ఝాన్సీ, గంటా రాము, ప్రదీప్, వినయ్, గిరిబాబు, హైమద్, లబ్ధిదారులు, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top