భూభారతితో భూ సమస్యలు పరిష్కారం*……

TEJA NEWS

భూభారతితో భూ సమస్యలు పరిష్కారం*……….
జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
భూభారతి కొత్త రెవెన్యూ చట్టంలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారము ఏదుల మండలం రేకులపల్లిలో తాసిల్దార్ మల్లికార్జున్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 1 లో ఉన్న పాత రిజిస్ట్రేషన్ లో రైతులను స్వయంగా ఒక్కొక్కరిని పరిస్థితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ రైతులు ఎక్కువ శాతం సర్వేనెంబర్ 1, 2, 3 ,4 ,169, 180, 227, 228 నెంబర్లలో అసలైన రైతులకు పట్టాలు లేవని వేరే రైతుల పేరిట ఎక్కువ శాతం ఉన్నాయని వివరించారు. ఇట్టి విషయంపై తాసిల్దార్ కు ఇట్టి లిస్టును పరిశీలించి సర్వేయర్ తో కలిసి మోకాపై లేని వారికి నోటీసులు ఇచ్చి వారిని తొలగించి,పట్టా లేని వారికి భూమి నమోదు చేయుటకు ప్రపోజల్ పంపమని ఆదేశించారు. అలాగే ఇట్టి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్యక్రమంలో గిర్దావరి భాస్కర్ రెడ్డి, జేఏలు యాదగిరి, భరత్, రికార్డు అసిస్టెంట్లు రమేష్, ఆపరేటర్ వినయ్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top