నిర్లక్ష్యమా నీ చిరునామా ఎక్కడ…

TEJA NEWS

నిర్లక్ష్యమా నీ చిరునామా ఎక్కడ…

పరిశీలించగలరు

సుమారు ఇరవై మూడు శునకాలను రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నివాసాలప్రాంతాలనుండి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించుటకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ నందుగల అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కు (అనిమల్ వెల్ఫేర్ బోర్డు అఫ్ ఇండియా, హర్యానా వారి గుర్తింపులేని సెంటర్ అనగా – రూల్ 3 అఫ్ ఏబీసీ రూల్స్, 2023 అనుసరించి ప్రాజెక్ట్ రెకగ్నిషన్ సర్టిఫికెట్ ఏబీసీ సెంటర్కు తప్పనిసరి, లేకుండా ప్రస్తుత గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రభుత్వ సంస్ధ అయ్యుండి నిబంధనలు తుంగలోతొక్కి యదేచ్చగా వీధి శునకాల ఆపరేషన్లు అస్థవ్యస్థముగా నిర్వర్తిసుతుంది) రేపల్లె వీధుల్లో ఉన్న శునకాలను సోమవారం అనగా 09-06-2025 తరలించటం జరిగినది. శునకాలను తరలించే క్రమములో రేపల్లె నుండి గుంటూరు 70 కిలోమీటర్లు ఉన్నందున అటు రేపల్లె మున్సిపాలిటీ అధికారుల మరియు సిబంది ఇటు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల మరియు సిబంది పర్యవేక్షణ లోపబూయిష్టముగా ఉంటూ భాష మరియు పరిసరాల అవగాహనా లేని హిందీ వచ్చిన శునకాలను పట్టుకునే సిబంది తప్పిదం వలన 70 కిలోమీటర్ల మార్గమధ్యములో 23 సంఖ్యా గల రేపల్లెకు చెందిన వీధి శునకాలు తప్పిపోవటం జరిగినది అని ఆలస్యముగా వెలుగులోకి వచ్చినది.

రేబిస్ వ్యాక్సిన్లు ఇప్పటివరకు రేపల్లె మున్సిపాలిటీ వారు తప్పిపోయిన శునకాలకు అందించి ఉండలేదని సమాచారం. క్రొత్త ప్రదేశములో తప్పిపోయిన శునకాలు అక్కడ ఉన్న ప్రజలకు ఏ మాత్రం ముప్పుకలిగుంచిన ఊహించలేని ప్రాణ నష్టం మరియు తీవ్ర గాయాలకు అధికారులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశము లేకపోలేదు.

సుమారు రేపల్లెకే చెందిన ఆపరేషన్ నిమిత్తం పంపిన మరో పది శునకాలు ఏబీసీ సెంటర్లో అనుమానాస్పద మృతి చెందినట్లు తెలియవచ్చింది.

టాక్సుల రూపములో ప్రజలు చెల్లిస్తున్న ధనాన్ని వృధాగా మున్సిపాలిటీ వారు ఖర్చుచేస్తూ పదేపదే తప్పులు చేస్తున్న వారికి దన్నుగా నిలుస్తున్న అధికారులకు నైతికత మరియు వృత్తి నైపుణ్యత లోపించటం సమాజానికి మరియు ప్రజలకు ఎంతటి నష్టం వాటిలుతుందో గుర్తించి తగు కఠినమైన చర్యలకు ఆదేశించవలసిందిగా కొరతమైనది.

ఇంతటి బాధ్యతారాహిత్యముతో పనిచేస్తున్న అధికారులను నిర్లక్ష్యపు వైఖరితో ఉన్న సిబంది పై తక్షణమే శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలకు నిర్ణయం తీసుకోవలసిందిగా బాపట్ల మరియు గుంటూరు జిల్లాల గొరవ కలెక్టర్ల వారిని అభ్యర్దించటమైనది.
జాగు సురేష్
వ్యవస్థాపక కార్యదర్శి
బ్లూ క్రాస్ అఫ్ గుంటూరు.

You cannot copy content of this page

Scroll to Top