అప్పుల ఊబిలో అనేక రాష్ట్రాలు
రచయిత : కుసుమ సిద్ధారెడ్డి.
సూర్యాపేట జిల్లా : మన దేశంలోని అనేక రాష్ట్రాలు అప్పుల ఊబిలో పడి అవస్థలు పడుతున్నాయి.
అనేక రాష్ట్రాలు శక్తిని మించిన అప్పులు ఎందుకు చేస్తున్నాయి నిజంగా ఈ అప్పలతో రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారా ఎవరికోసం ఈ అప్పులు ఎందుకోసం ఈ అప్పులు ఈ అప్పుల వల్ల ఎవరికి ఎలాంటి అవసరాలు తీస్తున్నాయి.
అప్పులతో అభివృద్ధి సాధ్యమేనా నిజంగా అభివృద్ధి కోసమే ఈ అప్పులు చేస్తున్నారు అనుకుంటే
నిజంగా అప్పులతో అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆదాయం పెరగాలి కదా! ఆదాయం పెరిగినప్పుడు ఇంకా అదనపు అప్పులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రశ్న?
అభివృద్ధితో అప్పులు తీర్చాలి కానీ ప్రతి ఏటా అప్పులు రాష్ట్రాలకు ఎందుకు పెరుగుతున్నాయి. ఈ అప్పులు తీరేది ఎప్పుడు అప్పులు లేని రాష్ట్రంగా మనం చూడగలిగేది ఎప్పుడు? అప్పులు లేని రాష్ట్రంగా మనం చూడగలమా అనేది సందేహమే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలు మన దేశంలో 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలు శక్తికి మించిన అప్పులతో సతమతమవుతున్నాయి.
తీరని అప్పులతో ఆయా రాష్ట్రాలకు అవసరాలు ఎంతవరకు తీర్చగలిగారు ఈ అప్పలతో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏంటిది అన్నదే అసలైన ప్రశ్న?
మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నేటికి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నదని ఆ అప్పుకు వడ్డీ ప్రతినెల 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి స్వయంగా చెప్పారు
రాష్ట్రం మొత్తం ఆదాయం 18,500 కోట్లు ఒక నెలకి ఖర్చు 22 వేల ఐదు వందల కోట్లు అని ఇంకా ప్రతి నెల ప్రభుత్వం నడపడానికి 6500 కోట్లు అవసరం అవుతున్నాయని ఇది ప్రతి సభలోను సీఎం గారు చెప్పడం జరిగింది సీఎం గారు నిజంగా నిర్భయంగా ప్రజలకు ఆదాయ వ్యయాలు అప్పులు అనే విషయాలు ప్రజల ముందు ఉంచడం హర్షనీయమే
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి నెల ఆదాయం ఎంత ఖర్చు ఎంత అప్పులు ఎంత అప్పుకు కడుతున్నటువంటి వడ్డీ ఎంత అనే విషయాలు ప్రజల ముందుకు ఉంచిన సందర్భాలు లేవు
ఇది ప్రజాస్వామ్యం ప్రజలు కష్టపడి చెల్లించిన పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలా వచ్చిన ఆదాయంతో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపై ఉన్నది అన్న విషయం పాలకులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది
మన రాష్ట్రం ప్రతినెల 6,500 కోట్లు అప్పులకు వడ్డీలు కడుతున్నది అంటే సంవత్సరానికి 78 వేల కోట్లు వడ్డీ కడుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ డబ్బులతో రెండు భారీ ప్రాజెక్టులు నిర్మించవచ్చు ప్రతి ఏటా లక్షమందికి పైగా ఉద్యోగాలు కల్పించవచ్చు లేదా రెండు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగించే భారీ పరిశ్రమలు నెలకొల్పవచ్చు రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినప్పటికీ భారీ ప్రాజెక్టులు పూర్తిగా నిర్మించలేకపోయారు నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయారు పారిశ్రామిక అభివృద్ధి అంతంత మాత్రమే ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి దానివల్ల ప్రయోజనం కంటే ఆదాయం కంటే ఖర్చు అధికంగా అవుతుంది అని కొంతమంది మేధావులు వ్యక్తపరుస్తూ ఉన్నారు
అప్పులు ఎందుకు పెరిగినాయి
రాజకీయ పార్టీలు అధికారం చేజెక్కించుకోవడం కోసం అనేక ఉచిత పథకాలు ప్రవేశపెట్టి పెద్దగా ప్రయోజనం లేనటువంటి పథకాలు పెట్టడం రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనేక వాగ్దానాలు చేయడం అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం అప్పులు చేయడం రోడ్ల నిర్మాణంలోనూ ఇతర నిర్మాణా రంగంలోనూ నాణ్యత లోపించడం అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు కుమ్ముకై ప్రజాదనాన్ని దుర్యోగం చేస్తున్నారని ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతున్నటువంటి మాట వాస్తవం దీనిని అంతమొందించకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పయనింపజేయడం కష్టసాధ్యమే
పాలకులు రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రవేశపెట్టాలి నిర్మాణ రంగంలో జరుగుతున్న అవినీతిని కమిషన్ల వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉంది పాలకులు ఉత్పాదకరంగాలకు తగు ప్రాధాన్యత ఇచ్చి ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనుపాదకరంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అంటే ఉత్పాదకరంగాలకు తక్కువ ఖర్చు పెట్టి అనుక్పాలక రంగాలకు ఎక్కువ ఖర్చు పెట్టి వారు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్ వేస్తున్నారు
దీనికి బదులుగా ప్రజలకు విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచినట్లయితే వారి యొక్క తలసరి ఆదాయం పెరిగి వారికి ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు
ప్రతివారు వారికి కావలసిన వస్తువులన్నీ వస్తువుల సేవలు వారే స్వయంగా ఖర్చు పెట్టగలిగే స్థాయికి యువతను ఎదిగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
పాలకులు అధికారులు ద్వారా ఖర్చులను గుర్తించి కొంతమేర పొదుపు చేయగలిగితే ఈ అప్పుల బాధ నుండి కొంతవరకు యూత్ కలిగే అవకాశం ఉంది
పాలకొల్లు భాగం అయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులు కూడా పొదుపు మంత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉంది చట్టసభలోని సభ్యులు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు చేస్తున్నారు ఇది ప్రజలపై పెద్ద భారం పడుతున్నది
వందల కోట్లు ఆదాయం ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులకు ప్రతి సంవత్సరం లక్షల్లో పెన్షన్లు ఇస్తున్నారు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నవారికి పెన్షన్లు ఎందుకు అనేది సామాన్యుడు ప్రశ్న చివరిగా అప్పులు దేనికోసం చేస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఓటు బ్యాంకు రాజకీయాలు అధికారంలోకి రావడం కోసం అనవసరమైన వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారు ఇది సామాన్యుడి ప్రశ్న అది సామాన్యుడిపై పెనుబారంగా మారబోతుంది అన్నది అక్షర సత్యం ఈ విషయమై మేధావులు ఆర్థికవేత్తలు ఓటర్లు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది నిజం.
