డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన

TEJA NEWS

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి

ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశాను: మంత్రి శ్రీహరి
ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకం అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ని కలిశాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పర్యటనలో ఉన్నారని తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశానని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు తెలిపారు. త్వరలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులతో సంప్రదించి ఒక తేదీ ఖరారు చేసుకుని, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top