టీడీపీ రాష్ట్ర అధ్యక్షునికి తిరుపతి నేతలు పరామర్శ
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కుటుంబాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, “తుడా” చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డిలు విశాఖపట్నంలో పరామర్శించారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో సింహాచలం చిత్రపటానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డిలు నివాళులు అర్పించారు. విశాఖ సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి అక్కడ ఇటీవల స్వర్గస్థులైన పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పల్లా సింహాచలం మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
