దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తా వేదిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు
మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి ఆశయం ఆరోగ్య భారత నిర్మాణం ప్రతి వ్యక్తి తన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఉరుకులు పరుగుల జీవితంలో వత్తిడికి గురై గుండెపోటు,పక్షవాతం ఇతర అనారోగ్యం సమస్యలతో అర్దాంతరంగ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం వాతావరణంలో మార్పులు బయట దొరికే కలుషిత ఆహారానికి దూరంగా ఉంటూ ఎన్ని పనులు ఉన్నా కచ్చితంగా కనీసం ప్రతి రోజు ఒక గంట యోగా వ్యాయమానికి సమయం ఇవ్వాలి అప్పుడే కుటుంబంలో అందరు ఆరోగ్యం గా ఉంటారు తద్వారా దేశం సంపూర్ణ ఆరోగ్య దేశంగా బాసిళ్లుతుందన్నారు
యోగ మనకు మనం ఎవ్వరం ఒకరం చేసుకోలేము కావున గురువు సమక్షంలో చేస్తేనే ఉత్తమ ఫలితం వస్తుంది ప్రతి రోజు దుండిగల్ మున్సిపల్ పరిధిలో బౌరంపేట్, డి పోచంపల్లి, దుండిగల్ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఎస్ఎస్ సంస్థ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత యోగ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం నియమించిన బౌరంపేట్, దుండిగల్లో యోగ టీచర్లు కూడా అందుబాటులో ఉన్నారు బయట కుదరని వారికీ వీరు కాకుండా ప్రైవేట్ యోగ టీచర్ లు కూడా ఎంతో మంది అందుబాటులో ఉన్నారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు మీరు మీ కుటుంబం స్వీయ రక్షణ పొందగలరు
ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పతంజలి యోగ శిక్షక్ బత్తిని కిషన్ గౌడ్ ప్రోటోకాల్ ఆసనాలు వాటి విశిష్టత గురించి తెలియజేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగల్ విగ్నేష్వర్ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు శ్యామ్ రావ్ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, రామచంద్రరెడ్డి, గోనె మల్లారెడ్డి ప్రభాకర్ రెడ్డి, దమ్మగారి సీతారాం రెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి నర్సింహా చారి,మధు గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు
