ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న వ్యాపార కేంద్రాల పై చర్యలు తీసుకోండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ సర్కిల్ లోని అనేక ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపార కేంద్రాలను నడిపిస్తు, అక్రమ వ్యాపారం చేస్తూ నకిలీవి వాడుతు వినియోగదారులను మోసం చేస్తున్నారని,టాక్స్ లు కూడా లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వ అందయానికి గండి కొడుతూ ప్రజల వద్ద అధిక ధరలకు అమ్ముతున్నారని కావున అలాంటి వ్యాపార కేంద్రాలను మూసి వెయ్యాలని,అలాగే షాప్ లను రోడ్డు పైనవరకు షెడ్డులు వెయ్యడం వల్ల రోడ్డు పైన పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఏర్పడుతుందని అలాంటి వాటిని వెంటనే తొలగించాలని నేడు సిపిఐ కుత్బుల్లాపూర్ మండల సమితి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నర్సింహా కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఇలాంటివి తమ దృష్టిలో ఉన్నాయని అలాంటివాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి,సహాయ కార్యదర్శి హరినాథ్,సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి, కనకయ్య,ప్రభాకర్,వంశీ తదితరులు పాల్గొన్నారు.
