ఎమ్మెల్సీని పరామర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే
నెల్లూరు / తిరుపతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇటీవలే కంచర్ల శ్రీకాంత్ తండ్రి సీనియర్ పాత్రికేయులు, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు కంచర్ల రామయ్య స్వర్గస్థులయ్యారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సమయంలో ఎమ్మెల్యే నాని శ్రీకాంత్ తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఆ విషయం తెలుపుతూ…వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పులివర్తి నాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపి కంచర్ల రామయ్య చిత్ర పటానికి పుష్పాంజలితో నివాళి అర్పించారు.
