సూర్యాపేట సమీపంలో రోడ్డు ప్రమాదం: కాంట్రాక్ట్ టీచర్ మృతి

TEJA NEWS

సూర్యాపేట సమీపంలో రోడ్డు ప్రమాదం: కాంట్రాక్ట్ టీచర్ మృతి

సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ టీచర్ మృతి చెందిన విషాద సంఘటన వెలుగుచూసింది. వివరాల ప్రకారం, జ్యోతుల రామకృష్ణ (54) జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జ్యోతుల సృజన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రతిరోజులాగే ఈ రోజు ఉదయం సూర్యాపేట నుంచి బొప్పారం గ్రామానికి తన మోటార్ సైకిల్ (నెం. AP 24 AF 9157) పై వెళ్తుండగా, అచ్యుతండ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది.

ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ (నెం. TS 29 TA 2970) డ్రైవర్ ధరావత్ రాందాస్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ రామకృష్ణ వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రామకృష్ణకు తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య జ్యోతుల సృజన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్‌.ఐ. వి. వెంకటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి 13 ఏళ్ల కుమారుడు రుషి కృష్ణ ఉన్నాడు. కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

You cannot copy content of this page

Scroll to Top