ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు

TEJA NEWS

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు
సెలవు రోజుల్లోనూ ప్రత్యేక కౌంటర్లు

మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు

చిలకలూరిపేట: పట్టణ ప్రజల సౌకర్యార్థం ఆస్తి పన్ను చెల్లింపు గడువును పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత బకాయిలపై 50% వడ్డీ మినహాయింపును ఈ నెల 30 వరకు పొడిగించారు. అలాగే, 2026-27 సంవత్సరానికి పన్నును ఒకేసారి చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నారు. రేపు ఆదివారం (ఏప్రిల్ 26) మరియు ఇతర సెలవు దినాల్లో కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పి శ్రీహరి బాబు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

You cannot copy content of this page

Scroll to Top