అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం లో అన్నదాన కార్యక్రమం

TEJA NEWS

అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న దారపనేని, వడ్లమూడి

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో ప్రసిద్ధి చెందిన అభయ ఆంజనేయ స్వామి (నాయకుడి గుడి) దేవస్థానంలో శనివారం శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అధినేత వడ్లమూడి నాగేంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు విఠల కుమారస్వామి సారధ్యంలో దారపనేని చంద్రశేఖర్, వడ్లమూడి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకోల్లు అంకయ్య, కాకోల్లు సాయిబాబు, రమణయ్య అండ్ బ్రదర్స్, గొడుగులూరి అంకయ్య (బొట్టు) గోపీచంద్, మాలకొండ రాయుడు, అండ్ బ్రదర్స్ అండ్ సన్స్, మన్నం వెంకటస్వామి, కాకర్ల మహేశ్వర రావు,దారపనేని రాజేంద్రప్రసాద్, యరశింగు రాయుడు, మట్లె రాహుల్ యాదవ్, వడ్లమూరి వారి కుటుంబ సభ్యులు, గొడుగులూరి వారి కుటుంబ సభ్యులు, కాకర్ల వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అభయాంజనేయ స్వామి కృపకు పాత్రులైనారు.

You cannot copy content of this page

Scroll to Top