124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణం చాలా కాలం నుండి పెండింగులో ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయానికి వచ్చి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి హనుమాన్ నగర్ కాలనీ లో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఇప్పటికే నిధులు మంజూరై ఉన్నాయి కాబట్టి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. పిలవగానే సానుకూలంగా స్పందించి కాలనీని కి విచ్చేసిన కార్పొరేటర్ కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పోశెట్టిగౌడ్, ఇద్దయ్య, లక్ష్మణ్, సందీప్, శంషాద్, వెంకటేష్, హరి శంకర్, నిరంజన్, రమేష్, శ్రీను, ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
