మరణానంతరం పార్థీవ దేహం డొనేషన్ కు అంగీకారం

TEJA NEWS

మరణానంతరం పార్థీవ దేహం డొనేషన్ కు అంగీకారం

** భర్త స్ఫూర్తితో టీటీడీ అధికారిణి నిర్ణయం

** టీటీడీ ఈఓను కలిసి అఫిడవిట్ సమర్పణ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్ధీవ దేవాన్ని స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను శుక్రవారం కలిసి అఫిడవిట్ అందజేశారు. ఈ సందర్భంగా కట్టమంచి ఇందిర మాట్లాడుతూ… తన భర్త డా. కె.శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థీవదేవాన్ని మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త స్ఫూర్తితో…. ఆయన సూచన మేరకు తాను కూడా చనిపోయాక తన పార్థీవదేవాన్ని మహిళా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించిన అఫిడవిట్ ను ఈవోకు అందజేశారు. ఇందిర నిర్ణయాన్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా కె.ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టీటీడీ ఈవో పంపించారు.

దంపతులిద్దరూ సేవలోనూ భేష్….

గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యాభర్తలు ఇద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించడం జరిగింది.
ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతోపాటు కొంతమందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇందిర దంపతులు భేష్ అనేలా ఇటు టీటీడీ ఉద్యోగుల నుంచి, అధికారుల నుంచే కాకుండా స్నేహితుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

You cannot copy content of this page

Scroll to Top