మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేత్రత్వంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల ప్రాంగణం
చిలకలూరిపేట
ఎడ్లు నడిచే దారులు… నాగలి గీతలు నాగరికతకు మార్గరేఖలు : కేంద్రమంత్రి పెమ్మసాని
కూటమి ప్రభుత్వం నిత్యం రైతుక్షేమం గురించే ఆలోచిస్తుంది : మంత్రి ఆనం
• పల్నాడు ప్రాంతం నీతి, నిజాయితీలకు మారుపేరు: పెమ్మసాని
- ఐటీ, విద్యాశాఖల్ని అద్భుతంగా నిర్వహిండచంతో పాటు, అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వం చేసుకుంటూ దేశం గర్వించే నాయకుడిగా లోకేశ్ ఎదుగుతున్నారు : పెమ్మసాని
- ప్రత్తిపాటి, ధూళిపాళ్ల, ఆలపాటి వంటి నాయకులు భారీస్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహిస్తూ, ఒంగోలు జాతిని కాపాడుతున్నారు: పెమ్మసాని
- పశుసంపద పరిరక్షణలో భాగమే ఎడ్ల పందేలు : మంత్రి ఆనం
- ఎడ్ల పోటీలంటే రైతుల పోటీలే.. వారి ఆనందమే పోటీల ముఖ్య లక్ష్యం : ఆనం
- గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు 6నెలలకు చెల్లిస్తే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒక్కరోజులోనే చెల్లిస్తోంది : ఆనం
- ప్రత్తిపాటి స్ఫూర్తితో త్వరలోనే మా నియోజకవర్గంలోనూ భారీస్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహిస్తాం : భాష్యం ప్రవీణ్
- ప్రత్తిపాటే మాకు మార్గదర్శిగా వ్యవహరించి, ఆ పోటీలను కూడా విజయవంతం చేయాలి : ప్రవీణ్
లోకేశ్ దేశం గర్వించేలా ఎదుగుతున్నారు : కేంద్రమంత్రి పెమ్మసాని మాజీమంత్రి, శానససభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీస్థాయిలో జరుగుతున్న ఎడ్ల పందేల పండుగతో పాటు.. నేడు మరో ప్రత్యేకత ఉందని, పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ, తన తాతయ్య, తండ్రి ముఖ్యమంత్రులు అయినప్పటికీ ప్రజలు, రాష్ఠ్రం కోసం యువనేత మంత్రి నారాలోకేశ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఐటీ విద్యాశాఖల్ని మంత్రి లోకేశ్ అద్భుతంగా నిర్వహిస్తూనే, అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ లోకేశ్ దేశం గర్వించే స్థాయిలో ఎదుగుతున్నారని, వారికి ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని పెమ్మసాని ఆకాంక్షించారు. యువనాయకుడు లోకేశ్ జీవితంలో మరిన్ని ఉన్నతపదవుల్లో రాణించాలని కోరుకుంటూ, వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు పెమ్మసాని తెలిపారు.
ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా చివరి రోజు పోటీలకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావులు హాజరయ్యారు. పోటీలకు విచ్చేసిన అతిథుల్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎడ్ల పందేల మరియు ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు ఘనంగా శాలువాలు, మొమెంటోలతో సత్కరించారు. సన్మాన అనంతరం పెమ్మసాని, ఆనం, ప్రత్తిపాటి, ప్రవీణ్ లు సంయుక్తంగా ఎడ్ల పందేల విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందచేశారు. అనంతరం గ్రౌండ్ లోకి వెళ్లి ఎడ్ల యజమానులు, పోటీల నిర్వాహకులతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక టీడీపీనేతలు, పార్టీ అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసిన కేక్ లను అతిథులు కట్ చేసి, పార్టీ శ్రేణులకు కేక్ తినిపించారు. ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని, మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ప్రవీణ్ లు ప్రారంభించారు. చివరిగా కేంద్రమంత్రి పెమ్మసాని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం, మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పల్నాడు ప్రాంతం నీతి, నిజాయితీలకు మారుపేరు : పెమ్మసాని
తాను పుట్టి పెరిగిన ప్రాంతమైన పల్నాడు నీతి నిజాయితీలకు మారుపేరని, తాను ఇక్కడ పోటీ చేయాలనుకుంటే దేవుడు గుంటూరుకు పంపాడని, ఈ ప్రాంతంపై విపరీతమైన అభిమానం ఉందని చంద్రశేఖర్ తెలిపారు. జాతీయస్థాయి ఒంగోలు జాతి బలప్రదర్శనకు నన్ను ఆహ్వానించిన ప్రత్తిపాటికి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు.
ఎడ్లు నడిచే దారులు… నాగలి గీతలు నాగరికతకు మార్గరేఖలు
ఎడ్లు అనేవి శక్తికి, సహనానికి, విశ్వాసానికి మారుపేరని, వాటిని చూస్తుంటే అందం, రాజసం, పౌరుషం గుర్తుకొస్తాయని, పూర్వం నుంచి నేటివరకు ఎడ్లతో రైతుల బంధం విడీయరానిదని పెమ్మసాని చెప్పారు. ఎడ్లు నడిచిన దారి. నాగలి గీత నాగరికతకు మార్గరేఖలు అని ఆయన చెప్పారు. కాలక్రమేణా వాటి పోషణ చాలా ఖర్చుతో కూడుకున్నదని, రాష్ట్రంలో బాగా బలమైన ఒంగోలు జాతి ఎడ్లు 1000 మాత్రమే ఉన్నాయని పెమ్మసాని చెప్పారు. ఎడ్ల పోషకులు సాంబశివరావుతో మాట్లాడానని, ఆయన తనకున్న 8 ఎడ్లను పోషించడానికి దాదాపు కోటిరూపాయల వరకు ఖర్చు అవుతోందని చెప్పారని పెమ్మసాని తెలిపారు. ఎడ్ల సంఖ్య తగ్గిపోవడం బాధాకరం. ప్రమాదకరమని, వీటి పోషణ.. ప్రభుత్వ సాయం అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మా పార్లమెంట్లో ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు ఎడ్ల పందేలు నిర్వహిస్తూ వాటిని కాపాడుతున్నారన్నారు. పశువుల్ని పశువులుగా చూడకుండా, కుటుంబసభ్యులుగా.. వ్యవసాయ భాగస్వాములుగా, రైతు జీవన సహచరులుగా చూడాలని ఆయన సూచించారు. ఎడ్ల పందేలకు విచ్చేసిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నన్నట్టు పెమ్మసాని తెలిపారు.
పార్లమెంట్లో అడుగుపెట్టక ముందే పెమ్మసాని తానేంటో నిరూపించుకున్నారు : ప్రత్తిపాటి
రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలనుంచి కూడా ఎడ్ల పందేలు చూడటానికి ప్రజలు, రైతులు భారీసంఖ్యలో తరలివచ్చారని, నేడు యువనేత, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినం కూడా కావడం సంతోషించాల్సిన విషయమని, రెండు వేడులకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విచ్చేశారని మాజీమంత్రి ప్రత్తిపాటి చెప్పారు. మనదేశ చరిత్రలో గర్వంగా చెప్పుకునే నాయకుల్లో పెమ్మసాని ఒకరని, ఒంటిచేత్తో ఎవరూ సాధించలేని ఖ్యాతిని ఆయన సాధించారని, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారని ప్రత్తిపాటి కొనియాడారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు మెచ్చేలా తనకు అప్పగించిన బాధ్యతల్ని పెమ్మసాని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. పార్లమెంట్ లో అడుగుపెట్టకముందే పెమ్మసాని తానేంటో నిరూపించుకున్నాడన్నారు.
పశుసంపద పరిరక్షణలో ఎడ్ల పందేలు భాగమే * : *ఆనం రామనారాయణ రెడ్డి (దేవాదాయ శాఖ మంత్రి)
మనదేశంలో రైతు సంప్రదాయబద్ధంగా నిర్వహించే కార్యక్రమాల్లో అతి ప్రధానమైనది ఎడ్ల పందేలని, పూర్వీకుల నుంచి సంక్రమించిన పశుసంపద పరిరక్షణ నుంచే ఈ పోటీలు పుట్టాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాలానుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, ఎడ్ల పెంపకం తగ్గిపోయినప్పటికీ, ఒంగోలు జాతి గిత్తల పోషణను ప్రత్యేకత, పరువు, చరిత్ర కోసం పెంచేవారు ఉన్నారని ఆయన చెప్పారు. ఎడ్ల పందేలు రైతుల ప్రదర్శనగానే చూడాలని, పశుసంపదను కాపాడుకునేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. కష్టనష్టాలు ఉన్నప్పటికీ రైతులు పశుపోషణను విస్మరించరన్నారు.
రైతులకు రక్షణగా నిలిచే ప్రభుత్వం అధికారంలో ఉందని, రైతులెవరూ దిగులు పడాల్సిన పనిలేదని ఆనం తెలిపారు. కూటమిప్రభుత్వం నిత్యం రైతులు గురించే ఆలోచిస్తోందని, వారికి ఎలా మేలు చేయాలనే దానిపైనే చర్చిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. గతంలో ధాన్యం అమ్మిన రైతులకు 3 నుంచి 6 నెలలకు బకాయిలు చెల్లించిన ప్రభుత్వాన్ని చూశామని, ఇప్పుడున్న చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం ఒక్కరోజులోనే డబ్బు చెల్లిస్తోందన్నారు. కేంద్రమంత్రిగా పెమ్మసాని పనితీరు, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. ఎడ్ల పందేలకు రావాలంటూ, సోదరుడు ప్రత్తిపాటి రోజూ ఫోటోలు పంపించేవారని, అవిచూసే కొద్దీ నాలో ఇంకా ఆసక్తి ఎక్కువైందని ఆనం చెప్పారు. ఎడ్ల పోషకులకు ప్రభుత్వం అండగా నిలిచే అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆనం తెలియచేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆనం చెరగని ముద్ర వేశారు : ప్రత్తిపాటి
చిలకలూరిపేటలో భారీస్థాయిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలకు, కేంద్రమంత్రివ నెల్లూరు జిల్లా రాజకీయాలే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిఅని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సుదీర్థకాలం మంత్రిగా కొనసాగిన ఆయన అనుభవం నేడు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రవ్యాప్తంగా ఆయన అనేక మార్పులు చేపట్టారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సంతోషంగా వారికి దర్శనం కలిగేలా అన్ని ప్రధాన దేవాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చిలకలూరిపేటలో జరుగుతున్న ఎడ్ల పందేలు చూశాక..చాలా మంది నాయకులు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో కూడా భారీస్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహించే ఆలోచన చేయడం రాష్ట్ర రైతాంగానికి శుభసూచకమని ప్రత్తిపాటి చెప్పారు.
ప్రత్తిపాటి స్ఫూర్తితో త్వరలోనే మా నియోజకవర్గంలోనూ ఎడ్లపందేలు నిర్వహిస్తాం : భాష్యం ప్రవీణ్
నారా లోకేశ్ జన్మదినాన జాతీయస్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహించాలన్న మాజీమంత్రి, సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు ఆలోచన చాలా కొత్తగా ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి నాడు ప్రత్తిపాటి నాయకత్వంలో ప్రారంభించిన జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు యువనేత లోకేశ్ జన్మదినం నాటికి కనీవినీ ఎరుగని విధంగా జరుగడం, ప్రజలు భారీసంఖ్యలో తరలిరావడం చూస్తుంటే ఏదోజాతరకు వచ్చామా అన్న అనుభూతి కలుగుతోందని ప్రవీణ్ చెప్పారు. పంటలు చేతికి అందే సంక్రాంతి పండుగ నాటికి రైతులు సరదాగా ఇలాంటి పందేలు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారని ఆయన చెప్పారు. పశుసంపద తెలుగు రైతు కుటుంబాల్లో ఒక భాగమని, వాటిని రైతులు, వారి కుటుంబసభ్యులు ఆప్యాయంగా చూసుకుంటారన్నారు. మండుటెండల్లో కూడా పోటీలు తిలకించడానికి ప్రజలు, రైతులు ఈస్థాయిలో రావడం చూస్తుంటే సంతోషంగా ఉందన్న ప్రవీణ్, ప్రత్తిపాటి స్ఫూర్తితో త్వరలోనే మా నియోజకవర్గంలోనూ భారీస్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహిస్తామని సభాముఖంగా ప్రకటించారు. మేం నిర్వహించే పందేలకు ప్రత్తిపాటి మార్గదర్శకులుగా వ్యవహరించి, వాటిని ఇంతకంటే బాగా విజయవంతం చేయాలని ప్రవీణ్ కోరారు.
