పరిపాలనా దక్షులు సీఎం చంద్రబాబు
** పింఛన్ల పంపిణీలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే గురజాల
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న పరిపాలనా దక్షతతోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపరిపాలనకు తొలి అడుగేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువచేసి, ప్రశంస లందుకుంటోందని వారు తెలిపారు. అందుకే మాది ప్రజలు మెచ్చిన మంచి ప్రభుత్వమన్నారు.
చిత్తూరులోని
సిఎంకె రోడ్డు, కె.ఆర్.పల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. వృద్దులు, ప్రత్యేక ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితులకు పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో
ఏ ప్రభుత్వం చేయలేని పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగడం శుభపరిణామం అన్నారు. పేదలు లేని సమాజ స్థాపనే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి కోసం సంస్కరణలకు శ్రీకారం చుట్టి..,,ఏడాదిలోనే అద్భుతమైన వృద్ధిని వృద్ధిరేటును సాధించడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత, చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు.
