హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు లో సెవెరేజ్ నీరు కలుస్తున్న కారణంగా, గుర్రపు డెక్క పెరిగి దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడి కాలనీ వాసుల ఇబ్బంది మేరకు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వారి సిబ్బందితో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అలీ తలాబ్ చెరువులో సెవెరేజ్ నీరు కలుస్తున్న కారణంగా, గుర్రపు డెక్క పెరిగి దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఈ సమస్యతో దగ్గరి కాలనీల ప్రజల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ఘటనలు పెరిగాయని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని గమనించి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తో కలసి ఉదయం తొలిగంటలలోనే ఎంటమాలజీ, శానిటేషన్, ఇంజనీరింగ్, విభాగాలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సరస్సును పరిశీలించి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, సరస్సులోని గుర్రపు డెక్కను తొలగించి శుభ్రత చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి , కీటక శాస్త్రం సూపర్వైజర్ నరసింహ వారి సిబ్బంది, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఆల్విన్ వార్డు ఇంజనీరింగ్ ఏఈ యుగంధర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, శానిటేషన్ డీఈఈ శంకర్ గణేష్, ఏఈఈ బన్సీ పటేల్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వారి సిబ్బంది, ఇరిగేషన్ ఏఈ సర్వేశ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
