కావలి సంజీవ కి 2 లక్షల యాభైవేల రూపాయల LOC ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
….
కావలి సంజీవ అనారోగ్యంతో పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి వైద్యాపరీక్షల నిమిత్తము ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చెయ్యాలని కోరడం జరిగింది.. మాజీ ఎమ్మెల్యే వెంటనే స్పందించి *ఇంచార్జ్ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు * దృష్టికి తీసుకెళ్ళి 2.50 వేల LOC మంజూరు చేపించడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
— అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలలో చికిత్స పొందినవారు, చికిత్స నిమిత్తము వైద్య సేవలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది కావున ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని కోరారు…
ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయరాం, నిజాంపేట్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, కూన రాఘవేంద్ర గౌడ్, చౌడ శ్రీనివాస్, మోటే శ్రీనివాస్ యాదవ్, నాగిళ్ల శ్రీనివాస్, రమేష్ మంజూల్కర్, నర్సింగరావు, కృష్ణ యాదవ్, జిమ్ వేణు, దుగ్యాల ప్రసాద్, ఉలిపిశ్యాం, గుమస్తా మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
