కూటమిది అన్నీ స్కాములే…

TEJA NEWS

కూటమిది అన్నీ స్కాములే…

** తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి: దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లకు అమ్మేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ వందల కోట్లు దోపిడి కు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.
టూరిజం స్థలాలు ప్రయివేట్ వ్యక్తులకు ఇవ్వాలి అంటే పి. పి.పి విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానం లో ఇవ్వడం దారుణం అన్నారు.
దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు ఉన్నాయని తెలిపారు.


5ఏళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణం. ప్రభుత్వ ప్రకటన ఎక్కడ లేకుండా వెయ్యి కోట్ల స్థలం 1400 కోట్లు రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది.
లోకేష్ ఈ రెండు సంస్థలకు బినమీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వెల్ నెస్ సెంటర్లు బీచ్ ఏరియాలో ఉంటాయి.. కానీ ఆధ్యాత్మిక సెంటర్లో.. తిరుచానూరుకు కూతవేటు దూరంలో ఇలాంటి ఈ రెండు నిర్మాణ సంస్థలు ప్రయివెట్ వ్యక్తులు స్థలాలు కొనుగోలు చేశారు అనే సమాచారం ఉంది. దీనిలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది, రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం.
లాభాపేక్ష లేకుండా కేటాయించాల్సిన స్థలాలు ప్రయివేట్ సంస్థలకు కేటాయించడం ప్రభుత్వ చర్యలు ఉండవు.
లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో..జీవో లో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్ కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడంలో మతలబు ఏంటి.?
5 స్టార్, 3 స్టార్ హోటల్స్ నిర్మాణం చేస్తున్నారా….


స్థానికంగా ఉన్న హోటల్స్ కి వ్యాపారాలు లేవు.. ముంతాజ్ హోటల్ కు ఎందుకు కేటాయించలేదు.. మూడు వేల కోట్లు విలువైన భూమి టూరిజం నుంచి తీసుకుని టిటిడి స్థలం ఇచ్చారు. ముంతాజ్ కు ప్రభుత్వం స్థలం ఎందుకు ఇవ్వలేదు అని భూమన ప్రశ్నించారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి.. తిరుచానూరు అమ్మవారి ఆలయమునకు సమీపంలో స్థలం కేటాయించడం దారుణం.
రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్య శ్రీ డెవలపర్లు, సైబర్ సిటీ డెవలపర్లకు కేటాయించిన స్థలాలు రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అని కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎస్.ఆర్.ఓ ప్రకారం భూములు కేటాయించడం దారుణం. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు బంధువులు పూతలపట్టు లో ఇసుకు దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top