
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతికే చట్టబద్దత
** పునర్నిర్మాణ పనులు వేగిరం అయ్యాయి
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డితో సహా ఎవ్వరెన్ని కుట్రలు చేసినా అతి త్వరలోనే నవ్యాంధ్రకు “అమరావతి” రాజధానిగా చట్టబద్ధత వచ్చి తీరుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ అంశాలు, పరుగులు పెడుతున్న రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ అడ్డంకులు గురించి వివరిస్తూ మంగళవారం చిత్తూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకిటీల సురేంద్ర మాట్లాడుతూ పేదల సేవలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్నదని చెప్పారు. జగన్ హయాంలోని వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. తర్వాత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణ పనులు ప్రారంభించి వేగిరం చేసిందన్నారు. ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేసుకొంటూ , పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుపరి పాలన అందించడం అనే విలువలకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యేల సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. దాంతో పేదల ప్రభుత్వంగా, మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతున్నది.
రాష్ట్రంలో రెండవ విడతగా 2,50,893 ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ది దారులకు పంపిణీ చేసి గృహ ప్రవేశాలు చేయించడం జరిగింది.
2025 నవంబర్ 12వ తేదీన మొదటి విడతగా నిర్మాణం పూర్తి చేసిన 3,00,192 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఈ నేపథ్యంలో
రెండు విడతలుగా 20 నెలల్లోనే 5,50,314 ఇళ్లను లబ్ది దారులకు పంపిణీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది కూటమి ప్రభుత్వం.
జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం తన 5 ఏళ్ళ పాలనలో 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పి కేవలం 3 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మించారు.
లబ్ధిదారులకు రూ .1000 కోట్లు పైగా ఎగ్గొట్టారు.
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 8 లక్షల పైగా పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లులేని వారందరికి ఇల్లు ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది.
రాష్ట్రంలో 1.36 లక్షల మందిని రూ.1241 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేసి ఆదుకోవడం జరిగింది.
ప్రతినెలా 1 వ తేదీన 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. తల్లికి వందనం కింద చదువుకొనే అందరికి 15 వేలు రూపాయలు ఇస్తున్నారు. స్త్రీశక్తి కింద మహిళలకు, దివ్యంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
దీపం -2 కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు.
అన్నా కాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. 20.5 లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులతో 6.25 లక్షల మందికి ఉద్యోగ , ఉపాధ్యాయ అవకాశాలు కల్పించడం జరిగింది.
30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది.