రావిపాడు గ్రామంలో అఖిలభారత రైతు కూలి సంఘం గ్రామ మహాసభ

TEJA NEWS

రావిపాడు గ్రామంలో అఖిలభారత రైతు కూలి సంఘం గ్రామ మహాసభ

ఏఐకేఎంఎస్ జెండా ఆవిష్కరించిన బొడ్డుపల్లి శంకర్ జిల్లా కార్యదర్శి

మోతె మండలం : అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం గ్రామ మహాసభ లో జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ జిల్లా నాయకులు కోట మధుసూదన రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వ్యవసాయక రంగం ఉత్పత్తుల పైన నూతన విత్తన చట్టమును విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వి. బి రాంజీ పథకం తీసుకొచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు ఆత్మహత్యలు ఆగడం లేదని వీటికి కారణం ప్రభుత్వ ద్వందవిధానాలు అన్నారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రజలను మమేకం చేసి ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని రైతాంగ సమస్యల పరిష్కారం పోరాడాలని వారు అన్నారు అందులో భాగంగానే గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల కోసం ఈ మహాసభలు జరుపుకుంటున్నాం, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ హైమత్ బాబా, వీరాచారి, నిమ్మల మల్లయ్య, కొత్తపెళ్లి ఉప్పలయ్య, వార్డ్ మెంబర్ చింతకుంట్ల సతీష్, వెలుగు ఉప్పలి, కూషి కరుణాకర్, బాలగాని లింగయ్య, పప్పుల సైదులు, పొడపంగి అనిల్, గడ్డం లింగరాజు, పగిళ్ల వెంకన్న, కుంచం లింగరాజు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top