చందిప్ప శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం పై ఆరోపణలు

TEJA NEWS

చందిప్ప శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం పై ఆరోపణలు చేసిన సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ వ్యాఖ్యలను ఖండించిన ఆలయ కమిటీ

శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో వెలిసిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం పై ఆరోపణలు చేసిన శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ (సతీష్) వ్యాఖ్యలను ఆలయ కమిటీ సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా వారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ మే 28వ తేదీన పద్మా క్రాంతి దినపత్రికలో బుచ్చన్న విలేఖరి ప్రచురించిన చెంబెడు నీళ్లు 50 రూపాయలు, శణార్తి తెలంగాణ దినపత్రికలో ప్రవీణ్ విలేకరి ప్రచురించిన మహిళా భక్తులపై పూజారి దురుసుతనం వార్తలు నిజాలు కావని, సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ వారికి చెప్పి వార్తలు రాయించాడని మా దృష్టికి వచ్చిందని తెలిపారు.

స్వామివారి అభిషేకానికి రూ. 201 భక్తుల వద్ద తీసుకొని రసీదు ఇస్తామని, ప్రతినెల పౌర్ణమి, ప్రతి సోమవారం, పండగల పర్వదినాలలో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చినప్పుడు అభిషేకాలను రద్దుచేసి, రూ. 50 భక్తుల వద్ద తీసుకొని రసీదు ఇచ్చి, చెంబు నీళ్లను ఇస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చే వాహనాల పార్కింగ్ కొరకు గుడి దగ్గరలో ఎకరా భూమిని లీజుకు తీసుకున్నామని, ఆ భూమికి అద్దెను చెల్లిస్తున్నామని, ప్రతి వాహనానికి పార్కింగ్ రుసుము రూ. 20 రసీదు ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 5వ తేదీన పీఠాధిపతి మరకత ఆలయానికి వస్తే నరేష్ కుమార్ తన ఫోటోను ఎడిట్, మార్ఫింగ్ చేసి పత్రికలలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఒక ఆలయానికి నామకరణం చేయాలన్న శాస్త్ర ప్రకారం ఏ పేరును నిర్ణయించాలో అధికారం పీఠాధిపతులకు వేద పండితులకు శాస్త్రాలు చదివిన శాస్త్ర పండితులకు మాత్రమే అర్హత ఉంటుంది నామకరణం నరేష్ కుమార్ శ్రీకారం చేసినాడని చెప్పుకోవడం దినపత్రికలలో ప్రచురించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆలయానికి నామకరణం చేయాలంటే శాస్త్రాలు, వేదాలు, పంచాంగ పరిజ్ఞానం తెలిసి, చదివి ఉండాలి. మరి ఎక్కడ వేదాలు చదివాడు. నరేష్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులకు సమాజానికి తెలుపాలని కోరారు పురాతన ఆలయానికి నామకరణం చేయాలంటే ఆగమశాస్త్రాలు తెలిసి ఉండాలి. నరేష్ కుమార్ కు ఆగమ శాస్త్రాలు తెలుసా అని ప్రశ్నించారు? మేము దేనికైనా రెడీగా ఉన్నాము. నరేష్ కుమార్ ఆలయాన్ని అభివృద్ధి చేశాను అని గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆలయం ఆవరణలో రిటైర్డ్ పోలీసు అధికారి సుంకర సత్యనారాయణ షెడ్డును నిర్మించారు. నరేష్ కుమార్ షెడ్డును నేనే వేయించానని బయట ప్రచారం చేసుకుంటున్నాడు. మొదట నరేష్ కుమార్ ఆలయంలో ఉన్నప్పుడు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులంతా కలిసి బయటకు పంపి వేయడం జరిగిందన్నారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త కమిటీ ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం నాలుగవ కమిటీ ఉన్నది. 2013 నుండి దయాకర రాజు ఆలయంలో సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజును ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఆలయం తరఫున ప్రచారానికి మాత్రమే నియమించామని తెలిపారు. మొదట దయాకర రాజును ఆలయ జిల్లా చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా, జాతీయ చైర్మన్ గా నియమించి ప్రచారం చేయించామని, విదేశాలలో మరకత శివాలయం ప్రాముఖ్యతను వివరించడానికి అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా దయాకర రాజును నియమించామని వారు పేర్కొన్నారు. దయాకర్ రాజు నిజాయితీ నిబద్దలతో కూడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆలయం అన్ని వైపులా సీసీ కెమెరాలు పెట్టించామని, ఈనెల అమావాస్య రోజున ఆలయానికి వచ్చిన భక్తులను ఎవ్వర్నీ కూడా ఇబ్బందులకు గురి చేయలేదని, కించపరిచలేదని దినపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ పచ్చి అబద్దాలని ఆరోపించారు. వాస్తవాలు, నిజా నిజాలు తెలుసుకొని విలేకరులు వార్తలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top