అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా : తప్పిన ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సేంద్రియ ఎరువుల లోడుతో వినాయకపురం నుంచి అశ్వారావుపేట వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్, లారీని తప్పించబోయి డ్రైవర్ స్టీరింగ్ ను ఒక్కసారిగా తిప్పటంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో రోడ్డుపై మరెవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు, ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
