బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన “అంజయ్య నగర్

TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన “అంజయ్య నగర్ సీ బ్లాక్” నూతన కార్యవర్గం సభ్యులు…

126 -జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్య నగర్ సి బ్లాక్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. అంజయ్య నగర్ సి బ్లాక్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా నా శుభాకాంక్షలు. కాలనీ అభివృద్ది, ప్రజా సంక్షేమం విషయంలో సంక్షేమ సంఘం సభ్యులు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మధ్య వారధిగా ఉండాలన్నారు. మీరు గెలిపించిన మీ నాయకుడిగా కాలనీ అభివృద్దికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తరి మారయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.బాబు, నాగరాజు, వెంకటయ్య, లాలయ్య, రాజ శేఖర్, రమేష్, సోమేష్, అంజయ్య నగర్ సీ బ్లాక్ నూతన అధ్యక్షులు ఏ.గురవయ్య, ఉపాధ్యక్షులు ఎం.పాండు, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, కోశాధికారి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top