తిరుమల మొదటి ఘాట్‌లో భక్తులకు అన్నదానం

TEJA NEWS

తిరుమల మొదటి ఘాట్‌లో భక్తులకు అన్నదానం

** పాల్గొన్న టీటీడీ అడిషనల్ ఈఓ చౌదరి

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని అలిపిరి నడకమార్గం లో వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ మునిరత్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇతర టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top