సీఎం.. డెప్యూటీ సీఎం ఫోటోలకు పాలాభిషేకం

TEJA NEWS

సీఎం.. డెప్యూటీ సీఎం ఫోటోలకు పాలాభిషేకం

** “అన్నదాత సుఖీభవ” కార్యక్రమానికి కృతజ్ఞతగా..

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ హాజరు

పూతలపట్టు / తిరుపతి: రెండవ విడత “అన్నదాత సుఖీభవ” ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ చేసినందుకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం తవణంపల్లి మండలం జొన్నగురకల గ్రామంలో రైతులు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పండగ వాతావరణంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎన్నికల హామీలలో రైతులకి పంట సహాయం కింద రూ.20,000 జమ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా రూ.7000 జమ చేస్తే.. తాజాగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షలకు పైచిలుకు రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది.46వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రైతులకు అండగా ఉండాలని… రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2000 రూపాయలు జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 13000 ఇవ్వడానికి కూడా మీనమేషాలు లెక్కించిన పరిస్థితుల్లో ఈరోజు అలవోకగా రైతుల తలుపు తట్టి 20000/- రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కృతజ్ఞతగా రైతులు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మధు కుమార్ యాదవ్, బీసీ సెల్ నాయకుడు రామచంద్ర, నియోజకవర్గం పార్లమెంట్ మైనార్టీ సెల్ నాయకుడు షబ్బీర్, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి జైపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి హరిప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్, పంచాయతీ సెక్రటరీ రామరాజు, సచివాలయం సిబ్బంది క్రాంతి కుమార్, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం, టిడిపి నాయకులు దొమ్మరపల్లి వినోద్ కుమార్, తడకర మహేష్, రేషన్ డీలర్ రైతులు సుబ్బారెడ్డి, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి , కృష్ణ రెడ్డి, మోహన్ రెడ్డి , సోనీ శ్రీనివాసులు, యుగంధర్ రాజులతో పాటు
తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top