
ఆర్.జి-1 ఓసి.5 ప్రాజెక్ట్ నందు ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యా సాధనలో కార్మికులను అభినందించిన ఆర్జీవన్ జిఎం లలిత కుమార్….
పెద్దపల్లి//గోదావరిఖని: ఆర్.జి-1 ఓసి.5 ప్రాజెక్ట్ నందు ఉద్యోగులు అత్యుత్తమ పనితీరుతో నిర్దేచించిన ఈ ఆర్ధిక సంవత్సరం వార్షిక ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యా సాధనలో కేటాయించిన లక్ష్యం 32,00,000 లక్ష్యల టన్నులు, బొగ్గు రవాణాకు కేటాయించిన 33,39,798 లక్షల టన్నులకు గాను అదనంగా, 34,09,365 లక్షల టన్నుల అత్యధిక రవాణా రికార్డును నెలకొల్పినట్లు సాధించడం విశేషమన్నారు.
ఇట్టి రికార్డును నెలకొల్పిన సందర్బంగా అర్జీ.1 జియం డీ లలిత్ కుమార్ జిడికే ఓసి.5 ప్రాజెక్ట్ సందర్శించి ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను, యునియన్ ప్రతినిధులను అభినందించి ఈ విజయానికి కారణమైన వారికి బహుమతులు అందజేసి, అందరికి మిటాయిలు పంచిపెట్టారు.
ఈ విజయానికి కారణమైన సింగరేణి డైరెక్టర్స్, చైర్మన్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా జియం మాట్లాడుతూ.. ఇది అందరి సమిష్టి కృషితో అత్యుత్తమ పనితీరుతో పరస్పర సహకారం, సమన్వయం, క్రమశిక్షణ, అంకితభావంతోనే ఈ రికార్డు సాధ్యమయిందని జియం ప్రశంసించారు.
ఈ అద్భుత విజయాలు ఆర్.జి.I ఏరియాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇదే విధంగా వచ్చే ఆర్ధిక సంవత్సారానికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలను కూడా ఇదే స్పూర్తితో అధిగమించాలని జియం తెలిపారు.
ఈ కార్యక్రమములో గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీను, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి.రమేష్, ఏరియా ఇంజనీర్ రామమోహనరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి.రమేష్, స్టాటుటరి మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, డిజియం క్వాలిటీ బ్రహ్మాజీ, సియంవోఎఐ ఆర్.జి.1 ఉపాధ్యక్షులు పెరుమాండ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి దీటి చంద్రమౌళి, గని క్వాలిటీ ఇంచార్జ్ ఏ.రవి, బేస్ వర్క్ షాప్ ఇంచార్జ్ ఆర్ మహేష్, ఎఐటియుసి ఫిట్ సెక్రటరి గుర్రం ప్రభుదాస్, పీసీ పటేల్ కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.