“తుడ” చైర్మన్ కుమార్తెకు జన్మదిన వేడుకలు
** పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు
తిరుపతి: “తుడ” చైర్మన్ కమ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి కుమార్తె గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో నిర్వహించబడ్డాయి.
గెహిని రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్థానిక ప్రజలకు, నిరుపేదలకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆడంబరాలకు పోకుండా, సమాజ సేవలో భాగంగా తన కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 మందికి పైగా భక్తులు, స్థానికులు, పేద ప్రజలు పాల్గొని భోజనం చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వయంగా డాలర్స్ దివాకర్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి వడ్డించారు. ఈ సందర్బంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తన కుమార్తె గెహిని రెడ్డి ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆమెపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు కూటమి నాయకులు, డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు పాల్గొని, గెహిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
