డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక భవనంను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ.

TEJA NEWS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక భవనంను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …

జీహెచ్ఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి బౌరంపేట్ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక భవనంను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….బడుగు, బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మనీయమని అన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, రాజ్యాంగ రచన వల్లనే సమాజంలో అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. ఈ సామూహిక భవనాన్ని గ్రామవాసులు, ప్రజలు మరియు వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ , నాచారం మురళి యాదవ్, బెంబడి బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top