డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక భవనంను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

TEJA NEWS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక భవనంను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామూహిక నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను చిరస్మనీయం అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు పోరాటాల వల్లే సమాజంలో అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాము ఎల్లప్పుడూ వారి వెంట ఉంటామని తెలిపారు. ప్రజలు మరియు కాలనీ సభ్యులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, బౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు మురళి యాదవ్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, 125 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయరాం రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్వీ సురేందర్ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, బైండ్ల గోపాల్, వార్డ్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, స్థానిక నాయకులు బాబి, భూషణ్, బాబన్న, రాజు, ప్రభాకర్, శ్యామ్, యాదగిరి, మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top